ఐఫెల్ టవర్పై ఉన్న గ్రామం
తెల్లవారు సూర్య కిరణాలు కొండ ప్రాంతం గుడిసెల మీద పడుతూ ఉంటాయి. ఇది ఒక వెనక పడిపోయిన గ్రామం అక్కడ కరెంట్ లేదు నెట్వర్క్ లేదు ఎటువంటి ఆధునిక సౌకర్యాలు లేవు. సురేష్ గ్రామంలో అందరికంటే ఎక్కువ చదువుకున్న ఒక నిరుద్యోగి నిద్రలో నుంచి లేచి తలుపు దాకా వచ్చాడు. నేల మీద పడి ఉన్న ఒక ఉత్తరం అతని దృష్టిని మళ్ళంచింది. తను ఉత్తరాన్ని తీసి వేగంగా కొట్టుకునే గుండెతో దానిని తెరిచాడు. అది ఒక ఉద్యోగం లెటర్ అది కూడా పారిస్ కి చెందిన కంపెనీ నుండి సురేష్ కళ్ళల్లో మొదటిసారి ఒక వెలుగు కనిపించింది. తను పరిగెడుతూ
అనారోగ్యంతో ఉన్న తల్లి దగ్గరకు చేరుకున్నాడు. మంచం మీద కూర్చుని దగ్గుతూ ఉంటుంది. అమ్మ చూడు నాకు ఉద్యోగం వచ్చింది అది కూడా పారిస్ లో కంపెనీ వాళ్ళు వీసా పాస్పోర్ట్ ఇంకా టికెట్ కూడా పంపించారు. జీతం కూడా చాలా మంచిది. సురేష్ వాళ్ళ అమ్మ మౌనంగా ఉంటుంది. ఆమె కళ్ళు చెమ్మగిల్లుతాయి. బాబు నేను నిన్ను అందుకోసమే చదివించానా నువ్వు విదేశాలకు వెళ్ళడానికా నేను అనుకున్నాను నువ్వు చదువుకొని ఊరిని మారుస్తావని తల్లి మాటలు ఒక్క క్షణం పాటు గాలిని నిశబ్దం చేశాయి. కానీ సురేష్ లోపల పట్నం ఇంకా వెలుగు మీద ఆశ చాలా బలంగా నాటుకుపోయింది.
చాలా ఆపమ్మ ఈ వెనకపడిన గ్రామం ఎప్పటికీ మారదు నేను ఈ అవకాశాన్ని వదులుకోలేను. నాకు ఆరోగ్యం బాలేదు బాబు నువ్వేం కంగారుపడకమ్మ నీకు నయం అవుతుంది. నన్ను వెళ్ళనివ్వు ఈ అవకాశం నాకు మళ్ళీ దక్కదు. చాలా నచ్చ చెప్పిన తర్వాత తల్లి బరువైన మనసుతో అనుమతినిస్తుంది. మరుసటి రోజు సురేష్ తన స్నేహితులు పూజ ఇంకా నకుల్తో సెలవు తీసుకొని విదేశాలకు వెళ్ళిపోతాడు. పారిస్ లో సురేష్ మొదటిసారి ఆధునిక ప్రపంచాన్ని స్పృసిించాడు. తను మనసుపెట్టి పని చేశాడు. కొన్ని నెలల్లోనే చాలా డబ్బు సంపాదించాడు. పట్నం పరుగులో తను ఎంత మునిగిపోయాడంటే తనకి వాళ్ళ అమ్మ
పరిస్థితి తెలుసుకోవాలనే ఆలోచన కూడా లేదు. ఒకరోజు సాయంత్రం పనిలో సెలవు తీసుకొని ఐఫిల్ టవర్ చూడ్డానికి వెళ్తాడు. సాయంత్రం సమయం టవర్ వెలుగుతో మెరిసిపోతోంది. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దాన్ని చూడడానికి నిలబడ్డారు. ఏదో అద్భుత చమత్కారం ముందు నిలబడినట్టు సురేష్ జనాల మధ్యలో ఉన్నాడు. కానీ తన మనసులో ఏదో లోటు కనిపిస్తోంది. అసలు ఇందులో ఏముందని ఎత్తుగా ఉంది ఇలాంటి టవర్ ను నేను మా ఊళలో కూడా కట్టొచ్చు కదా కానీ మరక్షణం తన కళ్ళు చెమ్మగిల్లాయి తనకి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఆ వెలుగును తన గ్రామం ఎప్పుడూ కూడా
చూడలేదు. అక్కడ మా గ్రామంలో కూడా ఈ వెలుగు ఉంటే బాగుండేది. అందరూ అక్కడికే వస్తారు. అమ్మ ఎప్పుడూ ఇదే మాట అంటూ ఉండేది. ఆ రోజు రాత్రి తన మనసు విరిగిపోయింది. కొన్ని రోజుల్లోనే పని మీద తన శ్రద్ధ తగ్గిపోయింది. తల్లి జ్ఞాపకాలు ఊరి జ్ఞాపకాలు అన్ని తనను వెనక్కి పిలుస్తున్నాయి. మొత్తానికి సురేష్ రాజీనామా చేశాడు. భారతదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. సురేష్ గ్రామానికి తిరిగి వచ్చేసరికి తన అడుగు అక్కడే ఆగిపోయింది. ఊరు మునిగిపోయింది. పెద్ద వరద ఇళ్లను కూల్చేసింది. అందరూ కొంత దూరంగా ఎక్కడెక్కడో నివసిస్తున్నారు. ఆ
దృశ్యం తన మనసును కృంగదీసింది. అదే సమయం పూజ నకుల్ పరిగెత్తుకుంటూ తన దగ్గరకు వస్తారు. సురేష్ నువ్వు వెళ్ళిన తర్వాత పెద్ద వరద వచ్చింది. అంత అంతం అయిపోయింది. గవర్నమెంట్ కూడా సాయం చేయలేదు. సురేష్ కళ్ళు చెమ్మగిల్లాయి. మరి అమ్మ అమ్మ ఎలా ఉంది పూజా మాట ఆగిపోయింది. వరద నీటిలో నిన్ను తలుచుకుంటూ వెళ్ళిపోయారు. మేము నిన్ను సంప్రదించడానికి ఎంతో ప్రయత్నం చేశము. కానీ కంపెనీ వాళ్ళు సందేశాన్ని అందించలేదు. నీ నుండి కూడా జవాబు రాలేదు. సురేష్ ప్రపంచం అక్కడే ఆగిపోయింది. తను చాలా గట్టిగా ఏడిచాడు. తల్లి మాటలు ఆవిడ దుఃఖం ఆవిడ ఎదురుచూపులు అన్నీ తనలో ఎంతో
వేగంగా తిరిగి వచ్చాయి. తనకు అనిపించింది. పారిస్ వెలుగు తనని గుడ్డివాడిని చేసింది. సురేష్ టెంట్లలో ఉండేవాళ్ళు తన ఊరి వాళ్ళ దగ్గరకు వెళ్లి చూడటం మొదలు పెట్టాడు. వాళ్ళ నిస్సహాయత బలహీనతను మనస్ఫూర్తిగా అనుభూతి చెందాడు. ఆ తర్వాత చివరికి వాళ్ళ అమ్మను తలచుకొని తను ఒకసారి మళ్ళీ గట్టిగా ఏడవటం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఏడవడం వల్ల లాభం లేదు సురేష్ సురేష్ తల పట్టుకున్నాడు. నాకిప్పుడు నాకిప్పుడు మా అమ్మ చెప్పిన ప్రతి మాట గుర్తుకవస్తున్నాయి. నేను నేను ఆవిడ ప్రతి మాటను నిజం చేస్తాను. నేను ఈ ఊరికి వెలుగుని తీసుకొస్తాను.
పూజ నెమ్మదిగా ఇలా అంటుంది. ఇప్పుడు అది సాధ్యం కాదు సురేష్ వరద ఎంత భయంకరంగా వచ్చిందంటే మనం ఈ ఊరిని ఖాళీ చేయాల్సి వచ్చింది. గవర్నమెంట్ వాళ్ళ నిర్ణయం అది. వాళ్ళు చెప్పేసారు ఆ ఊర్లో నివసించే అవకాశం లేదు. అందుకనే ఇప్పుడు అందరం ఇక్కడున్నామో ఆ మాటలు సురేష్ ని మరింత కృంగదీశయి. తనేవి మాట్లాడలేకపోయాడు. తన మొహంలో కేవలం ఆలోచన మాత్రమే మిగిలింది. తర్వాత కొన్ని రోజుల వరకు తను తన స్నేహితులతో ఊరంతా గమనిస్తూ ఉన్నాడు. విరిగిన వస్తువులను తీయటం మిగిలిన వస్తువులను సేకరించటం అందరికీ ధైర్యం చెప్పటం ఆ తర్వాత ఒకరోజు సూర్యుడి సన్నని
కిరణాలు సురేష్ మొహం మీద ఒక ప్రత్యేకమైన మెరుపును చూపించాయి. నాకు ఒక ఆలోచన తట్టింది. పూజ ఆశ్చర్యపోయి ఇలా అంది. ఏమిటి ఆలోచన? నేను పారిస్ లో ఉన్నప్పుడు ఐఫిల్ టవర్ ని చూశాను. అందులో కొత్తగా ఏమీ లేదు. కానీ అందరూ దాన్ని గొప్పగా చూశారు. నన్ను నమ్ము అటువంటి టవర్ ని మన ఊళలో కూడా కట్టొచ్చు. నకుల్ వెంటనే ఇలా అన్నాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా టవర్ కడితే మాత్రం ఏంటి ఇక్కడ ఉండడానికి మాకు చోటు లేదు. సురేష్ గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. అదే కదా విషయం మనం ఎటువంటి ఐఫిల్ టవర్ ని కట్టాలంటే దాని మీద ఊరంతా ఉంటుంది. మన పేరు ఆ టవర్ తోనే ప్రసిద్ధి చెందాలి.
ఐఫిల్ టవర్ గ్రామం. సురేష్ మాటల్లో దృఢ నిశ్చయం ఉంది. తన దృఢత్వాన్ని చూసి పూజా మొహంలో కూడా నమ్మకం అనేది కనిపిస్తుంది. ఒకవేళ ఇది నీ కల అయితే మేము ఈ కలలో నీకు తప్పకుండా తోడుంటాం. సురేష్ తన ఊరి తడి మట్టిని చేతిలోకి తీసుకుంటాడు. ఆ మట్టి ఒకప్పుడు వాళ్ళ అమ్మ అడుగులకు దారి చూపించింది. తన అన్నిటికంటే ముందు ఆ మట్టిని ఎండబెట్టే ప్రక్రియను మొదలు పెట్టాడు. తను కర్రలు ఇంకా రాయి ముక్కలతో ఒక హీటర్ ను తయారు చేస్తాడు. మట్టిని ఎండపెడతాడు. ఆ తర్వాత దాన్ని కట్టి బలమైన నేలను తయారు చేశాడు. అప్పుడు టవర్ బేస్మెంట్ వరద కోసం ఎదురు చూడకుండా
ఉంటుంది. నిజానికి అది దాన్ని ఎదుర్కొంటుంది. పారిస్ లో సంపాదించిన ప్రతి రూపాయిని తను ఏమాత్రం ఆలోచించకుండా టవర్ ని కట్టడానికి ఉపయోగిస్తాడు. ఇనుప జాలీలు స్టీల్ స్టడ్స్ హై గ్రిప్ బోల్ట్స్ ఇంకా లైట్ వెయిట్ ఉన్న ఫ్రేమ్ వాటన్నిటిని కూడా కొండ మీదకు తీసుకొస్తాడు. ఊరివాళ్ళు అలసిపోయి కూర్చుంటే సురేష్ మాత్రం ఆగనే లేదు. రాత్రి పగలు ఒకటి చేసి టవర్ ని నిర్మించడం మొదలు పెట్టాడు. కొన్ని నెలల తర్వాత టవర్ సగం పూర్తయ్యాక అందరూ దూరం నుంచి దానిని చూసి ఆశ్చర్యపోయారు. పూజ ఆ టవర్ ని చూసి నెమ్మదిగా ఇలా అంటుంది. ఆ ఒకవేళ ఇది తయారైనా మనం దీని పైన ఊరిని ఎలా
కడతాము ఇల్్లు పొలాలు ఇవన్నీ ఎలా ఉంటాయి? సురేష్ మొహంలో చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. అంతా అవుతుంది. మన కోరిక బలమైనది అయితే భగవంతుడి మీద నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే. టవర్ ఎత్తు రెట్టింపయ్యే కొద్దీ సురేష్ నమ్మకము పెరుగుతూ ఉంటుంది. తను అన్నిటికంటే పై అంతస్తులో స్టీల్ గ్రిడ్ ప్లేట్ఫామ్ వేస్తాడు. దాని మీదే లైఫ్ లాకింగ్ టెక్నిక్ ఉన్న మోడ్యులర్ ఇల్లు తయారు చేస్తాడు. తేలికైనది బలమైనది భూకంప విరోధి. పైన ఒక చిన్న కృత్రిమ పొలాన్ని తయారు చేస్తాడు. అక్కడ మట్టి విశేష పోర్టబుల్ బెడ్ ఉంటుంది. అందులో ఊరి విత్తనాలు పెరుగుతాయి. చివరి భాగాల్లో ఒక
చిన్న చిన్న గోడౌన్లు ఉంటాయి. అక్కడ ధాన్యాన్ని దాచడానికి గాలి చొరబడని రక్షణ కేంద్రాలు ఉంటాయి. నీళ్ళను పైకి పంపించడానికి పైపింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. నిజానికి కింద సోలార్ లైట్లు పెట్టడం వల్ల మొత్తం టవర్ అంతా రాత్రివేళ అద్భుతంగా మెరుస్తుంది. మొత్తానికి నిర్మాణం పూర్తవుతుంది. ఊరి వాళ్ళందరూ కూడా ఒకచోట నిలబడి ఉంటారు. టవర్ వాళ్ళ కళ్ళల్లో చమత్కారంగా మెరుస్తూ ఉంటుంది. సురేష్ పూజ ఇంకా నకుల్ మెట్లు ఎక్కుతూ పైకి చేరుకుంటారు. వాళ్ళ వెనక ఊరంతా ముసలువాళ్ళు పిల్లలు ఆడవాళ్ళు నమ్మకంతో పైకి వెళ్తారు. ఎప్పుడైతే వాళ్ళు పైకి
చేరుకుంటారో అప్పుడు అందరి కళ్ళు ఆశ్చర్యానికి గురవుతాయి. పైన ఒక నిజమైన గ్రామం ఉంది పొలం ఉంది పచ్చని పైరు ఉంది ఇల్లు ఉన్నాయి. నీళ్ళ ట్యాంకులు ఉన్నాయి సోలార్ వెలుగు ఉంది. ఇక గాలిలో ఊరి మట్టిలోని అదే పాత సువాసన ఉంది. పిల్లలు నవ్వుతూ పరిగెడతారు. ముసలివాళ్ళు ఏడుస్తారు ఆడవాళ్ళు చేతులు జోడిస్తారు. పూజ నెమ్మదిగా ఇలా అంది. సురేష్ నువ్వు అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించావు. సురేష్ ఆకాశం వైపుకి చూస్తాడు. అక్కడ తన తల్లి కళ్ళు మెరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. కొన్ని నెలల్లోనే ఇఫుల్ టవర్ గ్రామం మొత్తం భారతదేశంలో చర్చనీయంగా
మారుతుంది. పర్యాటకులు బస్సుల్లో వచ్చి టవర్ కింద భాగం నుంచి దాని చివరి భాగం వరకు ఫోటోలు తీసుకుంటారు. ఊరి పొలాల్లో తిరుగుతారు పచ్చని పైరును చూస్తారు ఇళ్లలో కూర్చుని టీ తాగుతారు ఆశ్చర్యంతో అనుకుంటారు. ఇలాంటిది ప్రపంచంలోనే లేదు అని ఊరి వాళ్ళు ఇప్పుడు టెంట్లలో ఉండటం లేదు. వాళ్ళు ఆకాశానికి దగ్గరగా నివసిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, వెలుగు, గర్వం అన్నీ కూడా వాళ్ళకే సొంతం మొత్తం ప్రపంచంలో ఆ ప్రదేశం ఒక అద్భుతమైన స్థలంగా మారింది. ఒక కూతురి ఆలోచన, ఒక తల్లి కల, ఒక గ్రామంలోని నమ్మకానికి ప్రతీక. కొన్ని రోజుల తర్వాత సురేష్ పైన నిలబడి
అమ్మ ఇప్పుడు నీ గ్రామం చీకట్లో లేదు. అప్పుడప్పుడు కలల్లోను నిజం చేసుకోవడానికి ప్రపంచాన్ని చూడక్కర్లేదు నిజానికి మన గ్రామాన్ని మరొక్కసారి చూడాల్సిన అవసరం ఉంటుందంతే.

