AI READY
విద్యుత్ లేని ఊరు
శాంతిపురం అనే ఒక కుగ్రామం ఆ ఊరికి విద్యుత్తే లేదు కానీ దాన్ని ఎప్పుడు వాళ్ళు ఒక లోపంలా చూడలేదు. సూర్యుడు అస్తమించగానే చీకట్లో మునిగిపోయే శాంతిపురం లాంతర్లు దీపాలు వెలిగించి జీవితం గడిపేదే కానీ ఎప్పుడూ విద్యుత్తు కోసం ఆశపడలేదు. ఆ ఊరిలో అందరూ ఒకరినొకరు సాయం చేసుకుంటూ అలానే ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ ఉంటారు. అలా ఒకరోజు ఊరి పెద్దవాళ్ళంతా రచ్చబండ దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఆ ఊరి సర్పంచ్ సిద్దయ్యకి మండల కార్యాలయానికి రమ్మని పిలుపువచ్చింది. ఏంటో అని పక్కనున్న వాళ్ళందరూ కూడా అనుకున్నారే
కానీ తరువాత వారి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. కథ ఆ ఊరి ఆడవాళ్ళు కూరలు పడేయడం ఎందుకనో లేదా పంచుకొని తినడానికో ఏదో ఒక కారణం వల్ల అందరూ కలిసి బయట వీధిలో బరకాలు వేసి భోజనం చేద్దామని అంటారు. ఆ రోజు రాత్రి కూడా భోజన సమయానికి అందరూ ఆరు బయటక వచ్చి ఉన్నారు. లక్ష్మమ్మ పక్కింటి రమణమ్మతో మాట్లాడుతూ ఇలా అడిగింది. వదినా ఇంతకీ ఈరోజు ఏం కూర చేశవ్? ఏముందిలే వదినా బెండకాయ వేపుడు రసం ఇంకేమన్నా చేయడానికి నాకు ఓపిక లేక అవి చేసి ఊరుకున్నా పర్లేదులే వదినా నేను మాంసం వండాను అన్నయ్య అడిగితే వడ్డిద్దువు గాని ఆ సరే సరే
ఈలోగా ఆ వీధి మొగాళ్ళంతా కూడా బయట బరకాలు వేయడం మొదలు పెట్టారు. ఆ ఊరి మగవాళ్ళకి కూడా అందరూ కలిసి రాత్రి భోజనం చేయడం అంటే ఇష్టం. చాలా వరకు అందరూ అలానే తింటారు. పిల్లలందరికీ కూడా వాళ్ళ స్నేహితులతో కలిసి చేయడం సరదా. అందరూ గిన్నెలు పట్టుకొని వడ్డిస్తే తినడానికి సిద్ధంగా కూర్చున్నారు. అలా ప్రతిరోజు అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ తినడం అలా అయిపోయాక మగవాళ్ళు అలా బయట కూర్చోవడం. తర్వాత ఆడవాళ్ళు తినడం. వాళ్ళు కూడా అయిపోయాక ఆరు బయట పడుకునే వాళ్ళ కోసం పక్కను సిద్ధం చేయడం. ఇవన్నీ రోజు జరిగే పనులే ఎప్పుడు ఎలా ఏ పనైనా కూడా అందరూ కలిసి చేద్దాం
అనుకునే ఆ ఊరు విద్యుత్ కోసం ఏం చేస్తుందో చూడాలి. ఇక పిల్లల విషయానికి వస్తే పిల్లలందరూ కలిసి వారానికి ఒకసారైనా ఆరు బయట కలిసి పడుకుంటారు. పెద్దవాళ్ళతో కథలు చెప్పించుకుంటూ పొడుపు కథలు అడిగించుకుంటూ కలిసి పడుకుంటారు. ఆ రోజు రాత్రి లక్ష్మమ్మ ఈరోజు పిల్లలందరూ బాగా ఆడుకొని అలసిపోయారు. తొందరగా పడుకొండి పోతారులే రేపు పొద్దున్నే లేవాలి. అని అనుకుంటూ ఉంటే అది పక్కనే ఉన్న రమణమ్మ వింటూ అదేం జరగదు అదేం జరిగే పని కూడా కాదు వదిన వాళ్ళు కథలు వినకుండా ఎప్పుడు పడుకున్నారని వాళ్ళు అలసిపోయారు కదా ఈరోజైనా తొందరగా పడుకుంటారేమోనని
వాళ్ళు రోజు అలసిపోయాలని పడుకుంటారు కానీ కథలు వినకుండా పడుకోరు. ఏం చేస్తావులే అవును ఇంతకీ సుగనమ్మ వచ్చిందా? పిల్లలకన్నా ముందే ఆవిడే వచ్చేసింది తన మనవడిని తీసుకొని సరిపోయిందిలే అయినా సుగనమ్మ లేకపోతే మన పిల్లలు మన మాట ఎక్కడ వింటారో ఆ మరి ఆ నీతి కథల వల్లే మన పిల్లలు కొంచెమైనా భయపడుతున్నారు. ఈలోగా ఆరు బయట పడుకున్న పిల్లలు సుగునమ్మ కథ మొదలు పెట్టగానే కిక్కురు మనకుండా వినసాగారు. అనగనగా అంటూ ఆ రోజు ఇంకొక కొత్త కథ మొదలు పెట్టింది. మొగోళ్ళేమో పట్టిడి మంచాలు బయట వేసుకొని తలగడలు సర్దుకొని పడుకోవడానికిఅని సిద్ధమయ్యారు. అలా తర్వాత
పిల్లలు నిద్రలోకి జారుకున్నాక సుగునమ్మ కూడా ఇంటికెళ్లి పడుకుంది. ఆడవాళ్ళు పనులన్నీ పూర్తి చేసుకొని పడుకున్నారు. రోజు ఇంచుముంచు ఇలానే జరిగినా ఏరోజు వాళ్ళు బాధపడలేదు. ఇంకా కథలు వినడానికి పిల్లలు ఎదురు చూస్తారు. పెద్దవాళ్ళు వాళ్ళ పనుల్లోకి ఎప్పుడు వెళ్దామా అని చూస్తారు. తర్వాత రోజు ఉదయం శాంతిపురం రచ్చబండ దగ్గర ఉన్నప్పుడు సర్పంచ్ సిద్దయ్యకి మండల కార్యాలయానికి రమ్మని పిలుపువచ్చింది. ఆ ఊరు నుండి మండలం ఆఫీస్ కి వెళ్ళడానికి రెండు ఊర్లు దాటాలి. దారిలో ఎక్కడ చూసినా విద్యుత్ కి సంబంధించిన పోస్టర్లు మనసులు
మళ్ళీ మొదలెట్టారా అనుకున్నాడు. రాష్ట్రంలో ఒక రెండు నెలల నుండి ఈ పంచాయితీలు జరుగుతూనే ఉన్నాయి. ఆగిపోతున్నాయి. సిద్దయ్య అందు అందుకే పిలుస్తున్నారేమో ఉంటూ మొత్తానికి అక్కడికి చేరుకున్నాడు. బండి బయట స్టాండ్ లో పెట్టి లోపలికెళ్లి ఆఫీసర్ రూమ్ బయట కూర్చున్నాడు. ఒక ఐదు నిమిషాల తర్వాత పెద్ద ఆఫీసర్ గారి కింద పని చేసే ఆయన వచ్చి లోపలికి పిలిచాడు. నేను అని చెప్పబోతుంటే తెలుసండి శాంతిపురం సర్పంచ్ సిద్దయ్యగారు హో తెలుసా అనుకుంటూ సిద్దయ్య లోపలికి వెళ్ళాడు. పెద్ద ఆఫీసర్ గారు నవ్వుతూ రండి సిద్దయ్యగారు కూర్చోండి.
ఆ అయ్యా పిలిచారు ఏదైనా సమస్య సమస్య అంటూ ఏమి లేదు సిద్దయ్యగారు కానీ చెప్పండయ్యా ఏమి లేదు సిద్దయ్య మా కమిటీ అంతా చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చాం. ఏంటయ్యా దేని గురించి అదే మీ ఊరిలో విద్యుత్ గురించి ఇంకా విద్యుత్ స్తంభాలు వేసి కరెంటు లాగేద్దామని నిర్ణయించుకున్నాం. సిద్దయ్య ఏం మాట్లాడకుండా ఆఫీసర్ ని చూస్తూ అలా ఉండిపోయాడు. కొంతసేపటికి తేరుకొని అదేంటయ్యా ఏమై సిద్దయ్యా అది మంచి వార్తే కదా ఎప్పుడూ మీ ఊరిలో వెలుగు లేక తొందరగా పని ఆపేసి ఇళ్లకి వెళ్ళిపోతారుగా ఇప్పుడు మీకు విద్యుత్ అవసరమే కదా అవసరమా అంటే అవసరమే
కానీ విద్యుత్ లేకపోయినా మా జీవితాలు బానే ఉన్నాయ్యా ఎన్ని సంవత్సరాలు ఇంకా దీపాలు వెలిగించుకొని జీవనం సాగిస్తారు మొత్తం పనులు పూర్తయిపోయాయి ఒక్క నీ సంతకం తప్ప ఇదిగో అంటూ కాగితాలు బల్ల మీద సిద్ధంగా ఉంచాడు సిద్దయ్య వైపుకి తిప్పాడు. ఒక్కసారి ఊళలో వాళ్ళతో మాట్లాడి చెప్తానయ్యా ఇప్పుడు అదంతా అయ్యే పని కాదు సిద్దయ్య ఇప్పటికే మంత్రి గారి నుంచి తొందరగా పూర్తి చేయందని ఫోన్ల మీద ఫోన్లు కాబట్టి అంత సమయం లేదు ఇప్పుడు. నాకు ఇదే మొదటిసారి కదయ్యా చెప్పటం అవుననుకో ఇంకో పనిలో పడి మర్చిపోయాను. నిన్ను ముందే పిలిపించాల్సింది.
సిద్దయ్య ఇంకా ఏమి చేసేది లేక సంతకం పెట్టేసాడు. అంతా అయిపోయాక మెల్లగా ఉంటానయ్యా అని చెప్పి బయటిక వచ్చేసాడు. ఇదే మంచిదే కదా ఊరు మొత్తం రాత్రిపూట వెలుగుతో నిండిపోతుంది. కాలము మారుతుంది. మనం కూడా మారాలి. అనుకుంటూ బండి దగ్గరికి వచ్చి బండి మొదలు పెట్టాడు. ఊరిలో రచ్చబండ దగ్గర. సిద్దయ్య గోరు వెళ్లి గంట దాటింది ఇంకా రాలేదేంటి అని రచ్చబంట దగ్గర మిగిలిన పెద్ద మనుషులతో అన్నాడు. ఆ అవును కదా మర్చిపోయాం ఇంకా రాలేదేంటి? ఆ అవును ఈలోక అటు పక్క నుండి బడికి డుకా కొట్టి తిరుగుతున్న సిద్దయ్య కొడుకు సీను వాళ్ళకు కనిపించాడు.
సీను ఇలా రారా హాయ్ బాబాయ్ దొరికేసాను. అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. చెప్పు బాబాయ్ బడికి పోలే నీరసంగా ఉందని పోలేదు బాబాయ్ మరి ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు రా అమ్మ ఏదో కొనుక్కురమ్మంటే వచ్చాను బాబాయ్ వాళ్ళ అమ్మకి వాడంటే ప్రాణం ఒంట్లో బాలేదంటే కాలు కూడా కింద పెట్టనివ్వదు. ఆ విషయం ఊరంతా తెలుసు వీళ్ళు నవ్వుకుంటూ ఇలా సర్లే గానీ మీ నాన్న ఇంటి దగ్గరికి వచ్చాడా తెలిీదు బాబాయ్ ఆ అంటే లేదు బాబాయ్ నేను అక్కడి నుంచే వస్తున్నాగా సర్లేరా బుడంకాయ్ ఆడుకొప్పం అర్థమైందిలే ఈరోజు బడగొట్టావని హిహి అనుకుంటూ సీను అక్కడి నుండి
పారిపోయాడు. ఈలోక సర్పంచ్ సిద్దయ్య ఊర్లోకి వచ్చాడు. వచ్చి ఊరి వాళ్ళనంతా రచ్చబండ దగ్గరకు రమ్మని డప్పు వేయమన్నాడు. డప్పు వేసే రమణ సైకిల్ తీసుకొని ఊరంతా తిరుగుతూ సర్పంచ్ గారు గ్రామస్తులందరినీ రచ్చబండ దగ్గరికి రమ్మంటున్నారహో ఒక పావు గంటకి ఊరంతా రచ్చబండ దగ్గర హాజరయ్యారు. సిద్దయ్య సూటిగా జరిగిన విషయం మొత్తం చెప్పేసాడు. ఊరంతా రకరకాలుగా స్పందించారు. ఎప్పుడు ఊరంతా ఒక్క మాట మీదే ఉంటూ మంచి బంధాలతో ఉండే ఆ ఊరు ఇక ఇలా ఉండదేమో అని కొంతమంది భయపడ్డారు. ఇంకొంతమంది పనులు ఇంకా సులువవుతాయేమోనని కొంచెం ఊరట పొందారు. మరికొందరు ఇప్పుడు
విద్యుత్తు తర్వాత ఫోన్లు తర్వాత ఇంకేవో వస్తాయి. దూరం పెరిగిపోతుందేమోనని గుసగుసలాడారు. అంతా అలా ఉండగా పిల్లలు మాత్రం మనం రాత్రి కూడా ఏం భయం లేకుండా ఆడుకోవచ్చురా అని గంతులు వేశారు. మీటింగ్ అయిపోయాక ఎవరింటికి వాళ్ళు పొలానికి వెళ్ళేవాళ్ళు పొలానికి పిల్లలేమో బడికి వెళ్ళిపోయారు. ఒక వారం గడిచింది. విద్యుత్ పనులు చకచక సాగుతున్నాయి. ఎక్కడవక్కడ గుంతలు తీసి స్తంభాలు నిలబెట్టడం చాలా తీగలు తోవలో అడ్డంగా వదిలేయడం ఇది వారం నుండి జరిగే వ్యవహారం. కానీ ఊర్లో ఎవ్వరూ ఏమి మాట్లాడలేదు. అలా వారం కాస్త రెండు మూడు వారాలు అయ్యాయి. పనులు ముగిసాయి చాలా వరకు
ఏమి మారలేదు కానీ ఒకప్పుడు చాలా వరకు అందరూ బయట పడుకునేవారు. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది. సుగునమ్మ బాధపడుతుంది కానీ తనకి తాను ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా అని సర్ది చెప్పుకుంటుంది. అలా ఒకరోజు రమణమ్మకి సాయం కావాలి. పక్క ఊరు నుండి చుట్టాలు వచ్చారంటే వీధి మొత్తం వెళ్లి సాయం చేశారు. ఆ రోజు ఒక పండగలాగా ఉంది. అలా ఎవరికీ ఏం కావాలన్నా ఇంకొకరు సాయం చేయడం మాత్రం మారలేదు. ఏది మారినా ఆ బంధాలు మారలేదు. దానికి మాత్రం సుగునమ్మ చాలా సంతోషంగా ఉంది. అనగనక అందమైన పల్లెటూరు ఆ ఊరిలో లక్ష్మి అనే వృద్ధురాలు ఉండేది. ఆవిడ చేపలు పట్టి వాటిని అమ్మి జీవనం
సాగించేది. ఏంటి మామ్మ బయలుదేరావా కోడి గూయక ముందే లేస్తావ్ మేమైతే నీ అంత ఓపికగా లేవలేం. నేను నదికి వెళ్లి చేపలు పట్టకపోతే ఈ ఊర్లో ఉన్న జనాలు ఒప్పుకుంటారా జనాల మాటకేమో గానీ నేనైతే ఒప్పుకోను నువ్వు పట్టే చేప మా ఇంట్లో కూరగా వండకపోతే ముద్ద కూడా దిగదు నాకు. ఇక లక్ష్మీ నవ్వుకుంటూ సరే మనవడా అలా నాతో నది వడ్డు వరకు రా. సరే పదే మమ్మ నాకు ఎప్పటినుంచో చిన్న సందేహం ఉంది. ఏంటి నీ సందేహం అడుగు ఇంత వయసులో కూడా చురుగ్గా ప్రతిరోజు నదికెళ్లి నువ్వే స్వయంగా వలేసి అసలు చాపలు ఎలా పడుతున్నావో చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మామ్మ మొత్తానికి
ఇప్పుడు కుదురుతుందన్నమాట. అలా లక్ష్మి రాంబాబు ఇద్దరు నది దగ్గరకు వెళ్ళారు. లక్ష్మి నదిలో వల విసురుతూ ఏ వయసులోనూ నేను నది వడ్డుకు రాగలుగుతున్నానంటే కేవలం మనుషులకు నాపై ఉన్న నమ్మకం మరియు ప్రేమ అదేంటి మామ్మా కొన్ని సంవత్సరాల క్రితం నా భర్త చేపలు వేట చేస్తూ ఉండేవాడు. ఒకసారి ప్రభాదవసాత్తు సముద్రంలో అలల తాకిడికి పడవ బోల్తాబడి అతను చనిపోయాడు. ఆ సమయంలో నాకంటూ నా కొడుకు శేఖర్ తప్పించి ఇంకెవ్వరూ లేరు. నీ కొడుకు ఉన్నాడా ఎప్పుడు చూడలేదే ఇప్పుడు అతను ఎక్కడున్నాడో నాకు కూడా తెలియదు వాడు ఎక్కడున్నాడో అంటూ లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంది.
ఏడవలేమ అమ్మ అసలు ఏమైంది చెప్పు నా భర్త చనిపోయాక ఎలా బ్రతకాలో తెలియక ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక నా పదేళ్ల కొడుకుని పడవ ఎక్కించుకొని వేరే ఊరు వెళ్దామని చెప్పి నదిలో ప్రయాణించాము. కొంత దూరం వెళ్ళాక ఏమైందో తెలియదు. నేను ఈ ఊర్లో ఉన్నాను నా కొడుకు ఎక్కడ అని అడిగితే అతను కూడా పడవ మునిగిపోయి చనిపోయాడని చెప్పారు. నువ్వు మాత్రమే బ్రతికావని కూడా చెప్పారు. అంటే ఆ రోజు రాత్రి మీరు ప్రయాణించిన పడవు మునిగిందా అవును మనవడా ఇది నా తలరాత అనుకోవాలి కానీ ఎందుకో నా మనసు చెబుతుంది ఎక్కడో నా కొడుకు క్షేమంగా ఉన్నాడని ఒకవేళ ఉంటే
ఎక్కడున్నా ఎలా ఉన్నా నా దగ్గరికి చేరాలని దేవుడికి రోజు ప్రార్థిస్తున్నాను. మామ నువ్వేమి భయపడబాకు బాధపడబాకు ధైర్యంగా ఉండు ఈ ఊరు మొత్తం నీకు బంధువులే ఇంతలో అక్కడికి వచ్చిన దేవి అమ్మమ్మ త్వరగా వచ్చేసావే నేను కూడా నీతో పాటు వద్దామని అనుకున్నాను. ఈరోజు నాకు ఎలానో పడిలేదు నీకు సాయం చేద్దాం అనుకున్నాను. వల్లో పట్టిన చేపలు తిరిగి మళ్ళీ నదిలోకి వెళ్ళడానికి సాయం చేస్తావా ఏంటి? మా అమ్మకి చేపలు పట్టడం వచ్చు నువ్వేమి సాయం చేయవల్సిన పనిలే నువ్వు ఊరుకోరా మనవడా ఎప్పుడు దాన్ని ఆట పట్టిస్తూ ఉంటావు. అలా గడ్డి పెట్టు బామ్మ
నువ్వు తినే తిండి నేను ఎందుకు తింటాను చెప్పు ఆ గడ్డి నువ్వు ఒక్కదానివే తింటావ్. రాంబాబు అన్న మాటలకు లక్ష్మి నవ్వుకుంది. మామ చూసావా నవ్వితే ఎంత బాగుంటావో ఇలాగే నవ్వు మామ్మ. నీకు నీ భర్త కొడుకు లేకపోయినా ఈ ఊరు మొత్తం నీతోనే ఉన్నారు. నాకు ఆ మాట చాలులే సరే ఈరోజు నేను వల విసర్నా నువ్వు చదువుకోవాలి బాబు పట్టుకోవాల్సింది పుస్తకాలు వలలు కాదు అర్థమయిందా నువ్వు చెప్పావుగా అలానే చేస్తాను. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాఘవయ్యతో శ్రీను రాఘవ అక్కడ ఎందుకు అంతమంది మనుషులు ఉన్నారు అసలు అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ లక్ష్మి చేపలు అమ్ముతుంది. చేపలమ్మే
మనిషి దగ్గర అంతమంది మనుషులు చేపలు కొంటున్నారా చాలా ఆశ్చర్యంగా ఉందే ఆమె పట్టే చేపల రుచి శుభ్రత గురించి ఊరంతటికీ తెలుసు ఆ చేపలు కొని తినటానికి గ్రామస్తులు ఎదురు చూస్తారు. ముసలమ్మ పై ఉన్న నమ్మకానికి ఆమె చేతిలో ఉన్న చేపల రుచికి విలువ చాలా ఉంది. అంత బాగుంటుంది ఆమె పట్టే చేపల రుచి అవునా నిజమే నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఆ ముసలావిడ ఈ వయసులో చేపలు పట్టి వ్యాపారం చేయడం అంటే ఒక వింతేగా ఆవిడ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. చురుగ్గా పని చేస్తుంది. ఆవిడ్ని చూసి మనం నేర్చుకోవాలి. మనం ఆవిడ చేత ఓ పెద్ద దుకానం పెట్టిస్తే
ఎలా ఉంటుంది? నీకు గుర్తుందా పట్నం వాళ్ళు పల్లెటూలక వచ్చి చాపలు కొనుక్కొని వెళ్లి అక్కడ అమ్ముకుంటున్నారు. ఎక్కువ ధరకి వాళ్ళ అవసరాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇలా చేయటం వల్ల మన గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది. మంచి ఆలోచన ఇచ్చావురా ఈరోజే లక్ష్మి దగ్గరికి వెళ్లి మాట్లాడతాను. రాఘవయ్య ముసలవ్వ దగ్గరికి వెళ్లి మామ ఎలా ఉన్నావ్? కొంచెం అయినా విశ్రాంతి తీసుకోవచ్చుగా నీ ఆరోగ్యం ఏమైపోవాలి? నాకేముంది నేను బంగారంలో ఉన్నాను నాకేమైతే ఈ ఊరు వాళ్ళు ఉన్నారు కదా చూసుకోవడానికి ఆ మాటలకేం తక్కువ లేదు కానీ ఆకలిగా ఉంది ఏమైనా ఉంటే పెట్టు
ఆ ఆగు చేపల పులుసు ఉంటాను వండిస్తాను. ఆహా రుచి అద్భుతం ఈరోజు తృప్తిగా భోజనం చేశాను. ఇప్పుడు చెప్పు విషయం ఏమిటో ఎప్పుడు రాడిది ఈరోజు ఇంటికి వచ్చావు ఏదో విషయం ఉంది. ఏమీ లేదు మామ్మ నీతో ఒక పెద్ద దుకానం పెట్టించాలి అనుకుంటున్నాను. అది కూడా చేపల దుకానం. ఎప్పుడూ లేనిది ఇదేం కొత్త ఆలోచన. పట్ణంలో చేపల వ్యాపారం బాగా జరుగుతుంది. మొత్తానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పల్లెటూళ్లకు వెళ్లి తక్కువ దరికి చేపలు కొని ఎక్కువ దరికి పట్నంలో అమ్ముతున్నారు. నష్టపోతుంది పల్లెటూర్లో ఉన్న చేపలు అమ్మేవాళ్ళు కాబట్టి మనం ఏం చేయాలంటే మనమే
చేపలు పట్టి ఆ చేపలు నేరుగా పట్నం వెళ్లి అమ్మాలి. ఇలా చేస్తే మధ్యలో ఉన్న దలారులకి ఎక్కువ డబ్బు సంపాదించే దారి తగ్గుతుంది. బాగుంది నీ ఆలోచన కానీ నా మీద భారం వేస్తే నేను చేయగలనా ఈ వ్యాపారం నువ్వు చేసే వ్యాపారం వెనక నీకు మేము ఉంటాంగా సరేలే అలానే చేద్దాంలే నిన్నే ఈ వ్యాపారానికి ఎందుకు ఎంచుకున్నావ అంటే ఈ ఊరిలో చేపలు పట్టే విధానం నీకు మాత్రమే తెలుసు నాకు నీ మీద నమ్మకం ఉంది. అందుకే ఒక పెద్ద దుకానం పెట్టించి పెద్ద చేపల వ్యాపారం ఇక్కడి నుంచి మొదలు పెడదామని అందరం అనుకొని నీ దగ్గరికి వచ్చి చెప్పాను. అలా ఊరి జనాలు లక్ష్మి చేత పెద్ద చేపల
దుకాణం పెట్టించారు. కొద్ది రోజుల్లోనే బాగా వృద్ధి చెందింది. ఒకరోజు ఆ ఊరికి మచ్చ శాఖ అధికారి వచ్చారు. కంగారుగా రాంబాబు లక్ష్మి దగ్గరికి వచ్చి మామ నీ పని ఇంకా అయిపోయినట్టే ఏమైందిరా అలా కంగారుగా చెబుతున్నావ్ నాకెందుకో భయం వేస్తుంది. నిన్ను రాచబండ దగ్గరికి రమ్మన్నారు. ఇంక నీ పని అయిపోయినట్టే అక్కడ ఏమైందో వివరంగా చెప్పరా కొంచెం నేనేం చేశాను నన్నుఎందుకు రచ్చబండ దగ్గరికి రమ్మంటున్నారు నీకే వివరంగా తెలుస్తుంది నాతో రా లక్ష్మీ రాంబాబుతో రచ్చబండ దగ్గరికి వెళ్ళింది. లక్ష్మి అంటే నువ్వేనమ్మా అవును బాబు నేనేమైనా తప్పు చేశానా
నన్నుఎందుకు ఇక్కడికి రమ్మన్నారు నువ్వేమి తప్పు చేయలేదు నిన్ను మెచ్చుకోవడానికి ఇక్కడికి రమ్మన్నావ్. ఈ వయసులో కూడా మీరు నదికి వెళ్లి స్వయంగా వళళవేసి చేపలు పట్టి వ్యాపారం చేస్తున్నారు. అసలు ఎవరు నమ్మలేకపోతున్నారు. ఈ వయసులో కూడా ఇంత చురుగ్గా ఎలా పని చేస్తున్నారు? ఏముందయ్యా మన ఆలోచనా విధానం సక్రమంగా ఉంటే అన్నీ మంచే జరుగుతాయి. నువ్వు చాలా మంచి పని చేస్తున్నావ అమ్మ. నువ్వు వ్యాపారం మొదలు పెట్టినప్పటి నుంచి చేపల వ్యాపారం ద్వారా డబ్బులు సంపాదించే దలహారులు తగ్గిపోయారు. అది కేవలం నీ వల్ల మాత్రమే జరిగింది. ప్రభుత్వం వారు నన్ను ఈ
ఊరికి పంపించారు. నీకు కొంత డబ్బు ఇచ్చి రమన్నారు. ఈ డబ్బు నీకే తీసుకో నేను ఈ వ్యాపారం మొదలు పెట్టేలా చేసింది ఈ ఊరి ప్రజలు కాబట్టి ఈ డబ్బు ఈ ఊరికి చెందుతుంది. నాకు ఈ డబ్బు ఇచ్చే బదులు ఈ ఊరికి సరైన రహదారులు నీటి సదుపాయం కల్పించండయ్యా. ఇంకో విషయం అమ్మ ఎప్పుడో నువ్వు కోల్పోయావు అన్న నీ కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఈ విషయం నీకెలా తెలుసు ఈ రాంబాబు కొన్ని నెలల క్రితం నాకు ఉత్తరం రాశడు. నువ్వు నీ కుటుంబాన్ని కోల్పోయిన విధానాన్ని వివరంగా నాకు ఉత్తరం రాసి పంపించాడు. వెంటనే నేను వివరాలు తెలుసుకున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం
పడవ ప్రమాదం జరగటం నిజమే. నీ కొడుకు క్షేమంగానే ఉన్నాడు. ఒక కుటుంబం నీ కొడుకుని ఆదరించి పెంచింది. నీ కొడుకు కూడా నీకోసం వెతుకుతున్న విషయం నాకు తెలిసింది. మొత్తానికి నీ కొడుకు ఎక్కడున్నాడో మేము కనిపెట్టాం. ఇదిగో మామ్మ ఇతనే నీ కొడుకు లక్ష్మీ కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ కొడుకుని ప్రేమగా హత్తుకుంది. ఆ ఊరి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ కథలోని నీతి ఏంటంటే నిజాయితీకి సమానమైన ధనం లేదు. ఒకరు మనల్ని మోసం చేసినా మన మంచితనం ఎప్పుడు మనల్ని గెలిపిస్తుంది. వయసు శరీరానికి మాత్రమే పరిమితం మనసు పని చేయాలి అనుకుంటే ఏ వయసైనా చురుగ్గానే
ఉంటాం.

