Fake banking apps: నకిలీ బ్యాంకింగ్ యాప్లతో నయా మోసాలు...

ఈనాడు, అమరావతి: నకిలీ బ్యాంకింగ్ యాప్స్‌తో సైబర్ మోసాలు

నకిలీ బ్యాంకింగ్ యాప్ల ద్వారా సైబర్ నేరగాళ్లు కీలక సమాచారాన్ని సేకరించి కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు. లోగో, రంగు, ఇంటర్‌ఫేస్ వరకు అసలైన యాప్‌లానే తయారు చేస్తున్నారు.

అసలైనవిగా టోకరా వేసి..

ఓ ప్రైవేటు ఉద్యోగికి వాట్సప్‌లో కొత్త వెర్షన్ బ్యాంకింగ్ యాప్ అంటూ లింక్ వచ్చింది. డౌన్లోడ్ చేసి లాగిన్ అవగానే రూ.8.40 లక్షలు ఖాతా నుంచి డ్రా చేశారు.

విజయవాడకు చెందిన మహిళకు ఎస్ఎంఎస్ ద్వారా యాప్ అప్డేట్ అంటూ లింక్ వచ్చింది. కొద్దిసేపటికే రూ.2 లక్షలు మాయమయ్యాయి.

నేరగాళ్ల గుప్పిట్లోకి కీలక సమాచారం

అసలైన యాప్స్‌ను పోలి ఉండేలా నకిలీలు తయారు చేసి లాగిన్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు చోరీ చేస్తున్నారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

  • గూగుల్ ప్లేస్టోర్ / యాప్ స్టోర్ నుంచే యాప్‌లు డౌన్లోడ్ చేయాలి
  • గుర్తుతెలియని లింక్స్‌పై క్లిక్ చేయకూడదు
  • యాప్ డెవలపర్ పేరు, రివ్యూలు చెక్ చేయాలి
  • అవసరం లేని అనుమతులు ఇవ్వకూడదు
  • లావాదేవీలకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఆన్‌లో ఉంచాలి

మోసంబారినపడితే వెంటనే చేయాల్సినవి

  • నకిలీ యాప్‌ను వెంటనే Uninstall చేయాలి
  • మొబైల్ డేటా & Wi-Fi ఆఫ్ చేయాలి
  • అన్ని బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు మార్చాలి
  • బ్యాంక్ కస్టమర్ కేర్‌ను సంప్రదించాలి

నకిలీ బ్యాంకింగ్ యాప్స్, సైబర్ మోసాలు, బ్యాంక్ ఫ్రాడ్, ఆన్‌లైన్ మోసం, సైబర్ క్రైమ్ తెలుగు, అమరావతి న్యూస్

#CyberCrime #FakeBankingApps #OnlineFraud #BankFraud #TeluguNews #సైబర్‌మోసాలు #నకిలీయాప్స్ #తెలుగువార్తలు
కొత్తది పాతది